ఎమ్మెల్యేల కొనుగోలు కేసు:  నిందితుల విడుదల..మళ్ళీ అరెస్ట్.!

-

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరికొందరికి సిట్ నోటీసులు ఇచ్చింది. బి‌ఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్‌లకు నోటీసులు ఇచ్చింది. అయితే అనూహ్యంగా ఏసీబీ కోర్టు..సిట్‌కు షాక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన మెమోని కోర్టు కొట్టేసింది.

అటు సంతోష్, తుషార్, శ్రీనివాస్‌లపై దాఖలు చేసిన మెమోని సైతం కొట్టేసింది. ఇదే క్రమంలో మొదట ఈ కేసులో నిందితుడుగా ఉన్న సింహయాజీకి బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత రామచంద్రభారతి, నందకుమార్‌లకు బెయిల్ ఇచ్చారు. ముగ్గురు నిందితులు తాజాగా విడుదలయ్యారు. ఈలోపే నందకుమార్‌పై గతంలో ఉన్న కేసులు నేపథ్యంలో ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సిట్..హైకోర్టుకు వెళ్లింది. ఏసీబీ తన పరిధి దాటి వెళ్లిందని సిట్ అధికారి సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, జగ్గుస్వామి, భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చే విషయంలో ఏసీబీ కోర్టు తన పరిధిని మీరి వ్యవహరించిందని అని చెప్పుకొచ్చారు. ఆ నలుగురిని నిందితులుగా చేర్చాలని పేర్కొంటూ సిట్‌ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో..వెంటనే ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ సిట్‌ హైకోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను లంచ్‌ మోషన్‌ రూపంలో దాఖలుచేసింది. దీనిపై ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు…మరొకసారి దీనిపై గురువారం మరొకసారి విచారణ చేపడతామని పేర్కొంది.

అయితే ఏసీబీ కోర్టు సిట్‌కు షాక్ ఇవ్వడంపై బీజేపీ నేతలు..టీఆర్ఎస్‌ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీఎల్ సంతోష్ జీపైనే కేసు పెడతవా? ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా? అని బండి సంజయ్.. కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. మరి ఇంకా కేసులో ఎన్ని ట్విస్ట్ లు వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news