లైంగిక ఆరోపణలపై కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాజయ్య

-

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్ పూసపల్లి నవ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల పై స్వయంగా రాజయ్య.. నవ్య, ఆమె భర్త ప్రవీణ్ ఇంటికి వెళ్లి క్షమాపణలు కూడా తెలిపారు. అయితే తాజాగా లైంగిక ఆరోపణల విషయంలో ఎమ్మెల్యే రాజయ్య ఓ వేడుకలో భావోద్వేగానికి గురయ్యారు.

కరుణాపురం లో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రాజయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ ముందు కూర్చుని బోరున ఏడ్చారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేకే లైంగిక ఆరోపణలు చేస్తున్నారని భగవద్వీగానికి గురయ్యారు. 63 ఏళ్ల వయసు ఉన్న తనపై లైంగిక ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సొంత చెల్లిని, బిడ్డను కూడా ముట్టుకోలేని పరిస్థితి కల్పించాలని కన్నీటి పర్యంతమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news