కెసిఆర్ ప్రవేశపెట్టినటువంటి షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి ఎంతోమంది నిరుపేదలకు ఆసరాగా నిలిచాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.గురువారం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ ,బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మిమ్మల్ని సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. పేద కుటుంబాలలోని ఆడపిల్లలకు పెండ్లి చేయడం భారం కావద్దనే ఉద్దేశం తో కెసిఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చారని ఆమె తెలిపారు. దేశంలో ఇటువంటి పథకాలు ఎక్కడ ప్రవేశపెట్టలేదని ఆమె అన్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం హామీని త్వరగా ప్రవేశపెట్టాలని కోరారు . దీనితోపాటు మిగతా పథకాలను కూడా త్వరలోనే ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.