8 ఏళ్లలో కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేశారు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే రాజకీయాల్లో వేడిపుట్టింది. అప్పు లేకుండా కేసీఆర్ ఏ ప్రాజెక్టు కట్టారో చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 8 ఏళ్లలో కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు జీవన్ రెడ్డి. దేశ సంపదను మోడీ అంబానీ, అదానీలకు దోచిపెడుతుంటే..కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. క్రూడాయిల్ ధర పెరగకపోయినా ఇంధన ధరలు ఎందుకు పెంచారో చెప్పాలన్నారు జీవన్ రెడ్డి.

CM should reconsider regulated cropping pattern policy: Telangana MLC  Jeevan Reddy | Hyderabad News - Times of India

బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారన్నారు జీవన్ రెడ్డి. ఒక్క రూపాయి కూడా అప్పు తేకుండా పోచంపాడు, శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్మించిన చరిత్ర తమదన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందన్నారు. హైదరాబాద్ లోని విలువైన భూములు అమ్మినట్లుగానే.. జిల్లా కేంద్రాల్లోని భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుంన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వచ్చాకే మూడు నిజాం చక్కెర ఫ్యాక్టరీలు మూసివేశారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news