గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి మోదీని ఎందుకు ప్రశ్నించలేదు :కవిత

-

హైదరాబాద్: తమపాలనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ పాలించిన 60 ఏళ్ల కాలంలో మహిళల కోసం ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా? అంటూ ద్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

K Kavitha, KCR's daughter, to appear before ED on March 11 - India Today

గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చిందని, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారని అన్నారు. స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ వాడుకుందన్నారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే బీఆర్ఎస్ డిమాండ్‌ను కూడా వెకిలిగా మాట్లాడడం ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news