కొడాలి నానిపై ధ్వజమెత్తిన యార్లగడ్డ

-

గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీపై చేసిన కామెంట్లకు టీడీపీ నేత యార్లగడ్డ కౌంటర్‌ ఇచ్చారు. కొడాలి నాని వల్లే గతంలో నందమూరి హరికృష్ణ గుడివాడలో ఓడిపోయారని వెల్లడించారు. కొడాలి నాని పెళ్లికి హరికృష్ణ ఎందుకు రాలేదని యార్లగడ్డ ప్రశ్నించారు.

Gannavaram,Yarlagadda Venkata Rao: వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై..  టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన - gannavaram leader yarlagadda venkata rao  will join in tdp - Samayam Telugu

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొడాలి నాని… హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు వాడుకుంటాడని విమర్శించారు. కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు తెలుగు భాషకే అవమానం అని యార్లగడ్డ మండిపడ్డారు. పార్టీ కోరుకుంటే గుడివాడ వెళ్లి కొడాలి నానిపై పోటీ చేసేందుకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు యార్లగడ్డ.

గన్నవరం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ప్రాంతం అని, టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారిందని యార్లగడ్డ వివరించారు. గతంలో కొనకళ్ల నారాయణ ఎంపీగా గెలిచేందుకు ప్రధాన కారణం గన్నవరం నియోజకవర్గమేనని అన్నారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ బాలశౌరికి గన్నవరంలో 10 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో మంచి పోలీసు అధికారులు ఉండి ఉంటే తానే గెలిచేవాడ్నని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ్నించైనా పోటీ చేస్తానని, గన్నవరం నియోజకవర్గాన్ని టీడీపీ ఖాతాలో వేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news