హోలీ స్పెషల్: ఇలా ఇంట్లోనే రంగులని చేసుకోండి…!

-

హోలీ అంటేనే రంగులు. రంగులు చల్లుకుని ఇంటిల్లిపాదీ ఎంతో ఆనందంగా హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 28 వ తేదీన వచ్చింది. హోలీ పండుగ జరుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రంగు లో ఉండే కెమికల్స్ స్కిన్ ఇరిటేషన్, తలనొప్పి మొదలైన వాటికి దారితీస్తాయి. పైగా కంటికి కూడా ప్రమాదమే కాబట్టి ఇంట్లోనే హెర్బల్ కలర్స్ ని తయారు చేసుకోండి.

దీనివల్ల హోలీ లో రంగులు చల్లుకున్న ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కెమికల్ కలిపిన రంగులు మొదలైన వాటి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే మీ ఇంట్లోనే హెర్బల్ కలర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం..!

ఆరెంజ్ కలర్ కోసం మీరు రాత్రంతా పాలాష్ పువ్వులని నాన పెట్టి ఉంచితే ఆరెంజ్ కలర్ వస్తుంది. అయితే శ్రీ కృష్ణుడు కూడా ఈ పూలతో హోలీ చేసుకోవడానికి ఉపయోగించడాన్ని అంటూ ఉంటారు.

అలానే ఆరెంజ్ కలర్ రావడానికి హరిసింగర్ పువ్వులను కూడా ఉపయోగించొచ్చు. దీనిని నీళ్ళల్లో నానబెడితే ఆరెంజ్ కలర్ వస్తుంది.

కొద్దిగా చందనం తీసుకుని ఒక లీటర్

వేస్తే ఈజీగా ఆరెంజ్ కలర్ వస్తుంది. అదే మీరు ఎర్రచందనాన్ని వేస్తే మంచి ఎరుపు రంగు వస్తుంది. పైగా ఇది చర్మానికి ఎటువంటి హాని కూడా చేయదు.

జస్వంతి పువ్వులని ఎండ లో ఎండబెట్టి వాటిని పొడి చేసి కొద్దిగా పిండి కలిపితే రంగు కూడా ఎక్కువ అవుతుంది. ఇలా ఎరుపు రంగు తయారు చెయ్యొచ్చు.

ఎర్ర చందనం పొడి తీసుకుని నీళ్లలో వేసి మరిగిస్తే ఎర్ర రంగు వస్తుంది. దీనిని పిచికారి చేయడానికి బాగుంటుంది.

దానిమ్మ తొక్క నీళ్లల్లో వేసి మరిగిస్తే కూడా మంచి ఎరుపు రంగు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news