ఎస్‌బీఐ గుడ్‌న్యూస్.. ఇంటి వద్ద నుంచే అన్ని రకాల సేవలు పొందండిలా..

దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు గుడ్‌న్యూస్ అందించింది. ఖాతాదారులకు అందుబాటులో కొత్త సేవలను తీసుకొచ్చింది. దీనికోసం ఒక కొత్త టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. ఈ నంబర్‌కు ఖాతాదారులు కాల్ చేస్తే.. బ్యాంకుకు సంబంధించిన అన్నిరకాల ఆర్థిక సేవలు ఇంటి వద్ద నుంచే సులభంగా పొందవచ్చు. అలాగే సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్‌బీఐ కొత్త టోల్ ఫ్రీ నంబర్ అయిన 1800 1234ను వాడుకలోకి తీసుకొచ్చింది. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసినట్లయితే.. ఖాతాలోని బ్యాలెన్స్, బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ వివరాలు, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్, డిస్పాచ్ స్టేటస్, చెక్‌బుక్ స్టేటస్, డిపాజిట్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, టీడీఎస్ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే కొత్త ఏటీఎం కార్డు కూడా పొందవచ్చు. ఈ సేవలు వారంలో 24 గంటలు అందుబాటులో ఉంటుంది.

ఎస్‌బీఐ వినియోగదారులు తమ బ్యాంకింగ్ సేవలు, సందేహాల నివృత్తి కోసం దేశీయంగా ఉన్న అన్ని రకాల మొబైల్స్, ల్యాండ్ లైన్స్ నంబర్ల నుంచి కూడా కాల్ చేయవచ్చు. బ్యాంకుకు రాని పరిస్థితితో ఎస్‌బీఐ టోల్‌ఫ్రీ నంబర్ ఎంతో ఉపయోగపడుతుందని బ్యాంక్ పేర్కొంది.