టీడీపీ అధినేత… ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. జాతిని ఉద్దేశించి మాట్లాడే సమయంలో చంద్రబాబుకి ప్రధాని ఫోన్ చేసినట్టు బాబే స్వయంగా మీడియాకు వెల్లడించారు. నిన్న ప్రధాన మంత్రి కార్యాలయానికి ఫోన్ చేశా అని… ప్రధాని నరేంద్ర మోదీతో రెండు నిమిషాలు మాట్లాడాలని అడిగా అని… ఇవాళ ఉదయం 08.30 గంటలకు ప్రధాని నాకు ఫోన్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.
చాలా సంతోషంగా అనిపించిందన్నారు. కరోనాకు సంబంధించి ఆయనతో నా ఆలోచనలను పంచుకున్న అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థకు కరోనా మహమ్మారి పెను సవాల్‌గా మారిందన్నారు చంద్రబాబు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడిన చంద్రబాబు.. కరోనాపై అందరూ వీరోచితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
కొన్ని రాష్ట్రాలు కట్టడి చేయగలుగుతున్నాయని… మరికొన్ని రాష్ట్రాలు సమర్థంగా చేయలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. నివారణకే కరోనా సమస్యకు పరిష్కారమని సూచించారు. కరోనాను కట్టడి చేయడంలో సీఎం జగన్ విఫమవుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి మోడీ ఫోన్ చేయడం ఆశ్చర్యంగా మారింది. కరోనాపై పోరాటంలో మోడీ అందరిని కలుపుకుని పోతున్నారని అన్నారు. మోడికి తన సలహాలు ఇచ్చినట్టు చెప్పారు. అంతా నాకే తెలుసు అనే అహంభావం తగదని వ్యాఖ్యానించారు.