మోడీ ఎలక్షన్స్ బొనాంజా!…

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సామన్య మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు మరో బొనాంజాను ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఓటమి పాలవడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభను క్రమేణ కోల్పోవడంతో..భాజపా దిద్దుబాటు చర్యను చేపట్టింది.  ఇప్పటికే అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నప్రభుత్వం ఇప్పుడు మరో భారీ తాయిలం ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా.. ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇదే జరిగితే కోట్లాది మంది మధ్యతరగతి వారికి భారీ ఊరట లభించినట్టే. త్వరలో ప్రవేశపెట్టనున్న ఓటాన్‌ అకౌంట్‌లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడంతో మోడీకి వచ్చినంత పేరు మరే ఇతర ప్రధానికి రాలేదని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో.. మోడీ తనదైన గుజరాత్ రాజకీయాలను దేశ వ్యాప్తంగా రుద్దాలని చూస్తున్నారంటు పలువురు విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news