ప్రియా ప్రకాశ్ వారియర్.. బాలీవుడ్ సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్ అదిరిపోయింది

-

Priya Prakash Varrier Sridevi Bungalow Official Trailer

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఓవర్ నైట్ స్టార్. కేవలం కన్ను కొట్టి కుర్రకారు గుండెల్ని పిండేసింది ప్రియా ప్రకాశ్. ఇప్పటి వరకు తన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకున్నా.. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. తన నటిస్తున్న మొట్టమొదటి మలయాళం సినిమా కూడా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. అయితే.. ఇంతలోనే తనకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చింది. తను బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమా పేరు శ్రీదేవి బంగ్లా. ఆ సినిమా ట్రైలర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ప్రశాంత్ మాంబుల్లి డైరెక్టర్. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ పేరు శ్రీదేవి. సినిమా ట్రైలర్ ప్రకారం.. సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది ప్రియా. కాకపోతే.. సినిమా ట్రైలర్ చివరలో కాసింత సస్పెన్స్. ఆమె స్టార్ గా హోదాను అనుభవించడం.. మళ్లీ ఏడుస్తూ బాత్ రూంలో కూర్చోవడం.. చివరకు బాత్ టబ్ లో రెండు కాళ్లను చూపించడం.. ఆధ్యంతం సస్పెన్స్ ను కలిగిస్తాయి. ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది. ట్రైలర్ లో ప్రియా నటన కూడా సూపర్బ్.

Read more RELATED
Recommended to you

Latest news