తెలంగాణ రైతులు ”వరి” మాత్రమే పండించాలి : బండి సంజయ్

-

వరి పంటపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులందరూ యాసంగిలో వరిని మాత్రమే పండించాలని పిలుపునిచ్చారు బండి సంజయ్‌. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొనిచ్చే బాధ్యతను బీజేపీ పార్టీ తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. గెలిచేది బీజేపీ మాత్రమేనని… సీఎం‌ కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని చురకలు అంటించారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్.. బీజేపీకి జితేందర్ రెడ్డి లక్కీ హ్యాండ్ గా మారారని… కేసీఆర్ మెడలు వంచి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయిస్తామన్నారు. హుజురాబాద్ ప్రజలు ఉద్యమస్ఫూర్తిని చాటారని… వెంటనే పెట్రోల్, డీజిల్ ధరను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు బండి సంజయ్‌.

దళితబంధు పథకం అమలు కోసం బీజేపీ పోరాటానికి సిద్ధమవుతోందని… దళితబంధు సమాజం చైతన్యమైతే ఏమవుతోందో హుజూరాబాద్ లో కేసీఆర్ చూశాడని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు .. నిరుద్యోగభృతి అమలు చేయాల్సిందేనని.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే నిరుద్యోగ మిలియన్ మార్చ్ ను‌ అడ్డుకోవాలని సవాల్‌ విసిరారు. ఈటల గెలుపుతో కేసీఆర్ కళ్ళు కిందికి దిగాయని టీఆర్ఎస్ నేతలు సైతం సంతోషిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత రాజకీయాలలోకి రావటానికి హుజురాబాద్ ప్రజలు మార్గనిర్దేశం చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news