తమిళనాడులోని సేలంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఇడ్లీలను విక్రయించనున్నారు. రూ.10కి 4 ఇడ్లీని అమ్మాలని నిర్ణయించారు. ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు మహేష్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మోదీ ఇడ్లీస్ పేరిట పలు కూపన్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోదీ ఇడ్లీ పేరిట తమిళనాడులో సేలంలో పలు ప్రాంతాల్లో పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లలో ఒక వైపు మోదీ బొమ్మ, మధ్యలో రూ.10కే 4 ఇడ్లీలు అనే టైటిల్, మరో వైపు ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మహేష్ బొమ్మలను చూడవచ్చు.
కమలం పువ్వు హీరో మహేష్ మోదీ ఇడ్లీలను ప్రవేశపెడుతున్నారు. త్వరలో రూ.10కే ఇడ్లీలను అమ్ముతారు. అధునాతన కిచెన్ లో రుచికరమైన ఆరోగ్యకరమైన ఇడ్లీలను త్వరలోనే కొనవచ్చు… అని సోషల్ మీడియాలో మోదీ ఇడ్లీ కూపన్లను షేర్ చేస్తున్నారు.
This is our Idly coupon , coupon size
14.5 cm x 6.75 cmRear side of this coupon we have space for advertisement. Rs 1 per coupon , minimum 50k coupons per advertiser . Those interested kindly DM Me 🙏🏻 pic.twitter.com/JSZFIwNjmj
— Mahesh 🇮🇳 (@Mahesh10816) August 29, 2020
కాగా ఆరంభంలో 22 మోదీ ఇడ్లీ సెంటర్లను పెట్టాలనుకున్నామని, కానీ ప్రస్తుతానికి ఒక సెంటర్ పెట్టి తరువాత వాటిని విస్తరిస్తామని తమిళనాడు బీజేపీ కార్యదర్శి ఆర్.బాలసుబ్రహ్మణియన్ తెలిపారు. అయితే తమిళనాడులో ఇడ్లీలు ఇలా చీప్ ధరలకు అమ్మడం ఇదేం కొత్త కాదు. గతంలో ట్రికీకి చెందిన 48 ఏళ్ల ఓ వ్యక్తి రూ.1కే ఒక ఇడ్లీ అమ్మగా, అదే రాష్ట్రానికి చెందిన కమలతల్ అనే 80 ఏళ్ల వృద్ధురాలు కూడా రూ.1కే ఒక ఇడ్లీ అమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇలా రూ.10కి 4 ఇడ్లీలను అమ్మాలని నిర్ణయించింది.