తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు సిరిసిల్లాలో పర్యటించిన కేటీఆర్ బీజేపీపై విరుచుకుడ్డారు. మేడారం జాతరకు కేంద్రం కేవలం రూ. 2 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కానీ ఉత్తరాదిలో జరిగే కుంభమేళ కు రూ. 300 కోట్లు ఇచ్చారని అన్నారు. మేడారం అంటే.. మినీ కుంభమేళా అని అన్నారు. ఆసియాలోనే రెండో అతి పెద్ద జాతరకు కేంద్రం ఇచ్చే నిధులు ఇదే అని ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. కానీ తుంగభద్రకు ఇచ్చారని విమర్శించారు. మోడీ ఉత్తర భారత్ కే ప్రధానియా.. తెలంగాణకు కాదా అని ప్రశ్నించారు.
నమో అంటే.. నమ్మించి మోసం చేడయమేనా అని అన్నారు. జీవితాలను మార్చమంటే.. ప్రధాని మోడీ జీవితా భీమా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఎంపీ బండి సంజయ్ పై తీవ్రంగా విమర్శించారు. ఎంపీగా ఏం పీకడానికి ఉన్నవ్ అంటూ ఘాటుగా విమర్శించారు. ఆయోధ్యలో రామ మందిరం కడుతున్నారని అన్నారు. కానీ ఈ ఎంపీ నియోజక వర్గంలో ఉన్న వేములవాడకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేడని విమర్శించారు. బీజేపీ నిజంగా హిందుత్వ పార్టీ అయితే.. వేములవాడ అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. కేంద్రం నుంచి ఒక్క విద్య సంస్థ అయినా.. తెచ్చావా అని బండి సంజయ్ ని ప్రశ్నించారు.