కరోనా వల్ల చాలా మంది ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింది. దీనికి ఎఫెక్ట్ కానివరంటే.. వేళ్లమీద లెక్కేసుకోవచ్చమో.. అయితే కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. రోగ నిరోధక శక్తి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. గుండె, ఊపిరితిత్తులు, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది.. కరోనా కారణంగా ఇప్పుడు క్షయవ్యాధి (టీబీ) కేసులు కూడా పెరగడం మొదలయ్యాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ వ్యాధి యువతకు ఎక్కువగా వస్తుంది.
టీబీ రోగులు చాలా మంది ఆసుపత్రులకు వస్తున్నారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలని కూడా దెబ్బతీస్తుంది. గతంలో యువతలో టీబీ కేసులు చాలా తక్కువగా ఉండేవి.. కానీ ఇప్పుడు చిన్న వయస్సులోనే TB బారిన పడటం చూసి వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులే టీబీ భారిన పడటం అందరిని కలిచివేస్తుంది.
మూడు వారాల కంటే ఎక్కువగా దగ్గుతో బాధపడటం వీళ్లలో అధికంగా కనిపిస్తోంది.. అందరు సాధారణ ఫ్లూ అనుకుంటున్నారు. కానీ దగ్గు మాత్రం విపరీతంగా వస్తుంది. ఊపిరితిత్తులలో సమస్యలు మొదలవడంతో ఆస్పత్రికి వస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేసి చూడగా టీబీకి గురైనట్లు తెలుస్తోంది.
కోవిడ్ వల్ల చాలామందిలో రోగనిరోధక దారుణంగా దెబ్బతింది. ఈ కారణంగా సులభంగా TB భారిన పడుతున్నారు. అంతేకాదు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకూ దగ్గు సమస్య తరచూ వస్తుంది. గత ఏడాది కాలంలో టీబీ రోగుల సంఖ్య 20 నుంచి 30 శాతం మేర పెరిగింది.
మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. TB శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రపంచంలో ప్రతిరోజూ 4100 మంది టిబి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారంటే.. సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి.. ఏటా 1.22 కోట్ల మంది దీని బారిన పడుతున్నారు. కరోనా తర్వాత TB రోగుల సమస్య పెరిగిందని WHO కూడా నమ్ముతోంది.
ఊపిరితిత్తులను ప్రభావితం చేసే సమస్యలు కరోనా తర్వాత పెరుగుతున్నాయి. కరోనా వల్ల మెయిన్ గా ఎఫెక్ట్ అయింది.. ఊపిరితిత్తులే. ఆరోగ్యంగా ఉండటం ఈరోజుల్లో చాలా అవసరం. చిన్న చిన్న సమస్యే కదా అని అశ్రద్ద తీసుకోకుండా.. తగిన చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం. రోజు ప్రాణాయామం చేస్తూ.. మంచి పోషకవిలువలతో కూడిన ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి. బయట ఫుడ్స్ తినడం తగ్గించండి. జంక్ ఫుడ్స్ వాడకాన్ని వీలైనంత వరకూ తగ్గించి.. ఫ్రూట్స్, నట్స్, ఆకుకూరలు లాంటివి డైలీ తినడం మంచిది. అధిక బరువు ఉన్నట్లైతే.. తగ్గేందుకు ప్రయత్నించాలి. ఇన్నాళ్లు అంటే.. ఉండనిలే.. ఈ వయసులో తగ్గి ఏం చేయాలి అని అనుకుని ఉంటారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. వీలైనంత వరకూ హెల్తీగా బరువు తగ్గేందుకు ప్రయత్నించమని నిపుణులు అంటున్నారు.
– Triveni Buskarowthu