ప్రతీ భారతీయుడినీ మెంటల్ గా ప్రిపేర్ చేసిన మోడీ ?

-

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడం కోసం చేపట్టిన చర్యలు బాగా పనిచేస్తున్నాయని ఇటీవల సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ అనటం అందరికీ తెలిసినదే. ఆ సమయంలో మళ్లీ లాక్ డౌన్ పొడిగిస్తే ఎలా ఉంటుంది, దశలవారీగా సడలింపులు పైన డిస్కస్ చేసారు. అందరూ గట్టిగా పోరాటం చేయడం వల్ల చాలా వరకు దేశంలో కరోనా వైరస్ కట్టడి చేసినట్లు మోడీ మొన్న తెలిపారు. ఆ సందర్భంలో చాలా రాష్ట్రాల సీఎంలు వైరస్ ప్రభావం చివరి దశలో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మే 3 కాక మరికొంత సమయం దేశంలో లాక్ డౌన్ పాటిస్తే బాగుంటుందని మోడీకి సూచించారు. Say no to panic, yes to precautions: PM Modi tweets on coronavirus ...ఈ విషయం నడుస్తూ ఉండగానే కరోనా వైరస్ కేసులు చాలావరకూ బయట పడుతున్న తరుణంలో ఇలాంటిది మళ్ళీ జరగకూడదు అని ప్లాన్ చేసి లాక్ డౌన్ పొడిగించేందుకే మోడీ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయట. ఈ క్రమంలో ప్రతి భారతీయుడిని మెంటల్ గా ప్రిపేర్ చేయడం కోసం ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య బయట పెట్టాలని ముఖ్యమంత్రులకు మోడీ సూచించారట.

 

మొత్తంమీద చూసుకుంటే మూడవ లాక్ డౌన్ కి కూడా భారతీయులు సిద్ధంగా ఉండాల్సిందే అన్న పరిస్థితి కనిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వేసవి ఉన్నంతకాలం లాక్ డౌన్ అమలు చేయాలనీ కేంద్రం భావిస్తోంది అని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న ఉష్ణోగ్రత లకు కరోనా వైరస్ తట్టుకోలేక పోతుందంట. ఇటువంటి సమయంలో ఉన్న కేసులను క్లియర్ చేసుకుని ప్రజలని ఇంటికి పరిమితం చేసి రాబోయే వర్షాకాలం లోగా దేశం లో వైరస్ జాడా లేకుండా చూడాలని కేంద్రం భావిస్తోందట. 

 

Read more RELATED
Recommended to you

Latest news