అమరావతి మరో ఢిల్లీ అవుతుందని మోడీ అన్నారు.. కానీ : మాజీ మంత్రి సోమిరెడ్డి

ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. అమరావతి బీడు ఉండాలనుకోవడం గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం దురదృష్టకరమైన అంశం అంటూ వ్యాఖ్యానించారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుతో పాటు జగన్ కూడా అమరావతికి ఆమోదం తెలిపారని… సాక్షాత్తు దేశ ప్రధాని మోదీ సైతం అమరావతికి శంకుస్థాపన చేశారు అంటూ గుర్తు చేశారు.

శంకుస్థాపన చేసిన సమయంలో అమరావతి మరో ఢిల్లీ కావాలంటూ మోడీ ఆశీర్వదించారని.. కానీ ప్రస్తుతం.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా… వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది అంటూ విమర్శించారు. టిడిపి పార్టీ కోపంతో ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదు అంటూ వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం లో జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని ప్రజాగ్రహానికి గురి కావడం తప్పదు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.