కేసిఆర్ షేమ్ ఆన్ యూ అంటూ ఉత్తమ్ కుమార్ విమర్శలు..?

సీఎం సొంత జిల్లా సిద్దిపేటలో రైతు నరసింహులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్నాయి. తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి.. తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తు విరుచుకుపడ్డారు,

దళిత రైతు నరసింహులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు,ఆ రైతు భూమిని బలవంతంగా లాక్కోవడం తోనే… రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. సీఎం సొంత జిల్లా అయిన సిద్దిపేట జిల్లాలోనే ఇలా జరిగితే… మిగతా ప్రాంతాల్లో రైతుల పరిస్థితి ఇంకెంత అధ్వానంగా ఉందో అంటూ విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న కేసిఆర్ ఆ భూమిని ఇవ్వకపోగా… రైతుకు ఉన్న 13 గుంటల భూమిని లాక్కోవడం నిజంగా సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.