మోదీ సొంతమైన మరో రికార్డ్….

-

ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకు ముందు ప్రపంచంలో ఎక్కువ ప్రజాధరణ ఉన్న నేతల్లో మొదటి స్థానంలో నిలిచారు మోదీ. 2021 సంవత్సరానికి ట్విట్టర్  ప్రకటించిన అత్యంత ప్రభావిశీల వ్యక్తుల్లో ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయంల వినియోగదారుల నిఘా కంపెనీ’ బ్రాండ్ వాష్‘ వార్షిక నివేదిక వల్ల తెలిసింది. మొత్తం 50 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మోదీ, మూడో స్థానంలో సింగర్ కేటీ పెర్రీ, నాలుగో స్థానంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఐదో స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఉన్నారు. అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 35వ స్థానంలో నిలిచాడు. దశాబ్ద కాలంగా సచిన్ యూనిసెఫ్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 2013లో యూనిసెఫ్ దక్షిణాసియా రాయబారిగా నియమితులయ్యాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ సేవలను బ్రాండ్ వాచ్ కొనియాడింది.

ఇటీవల ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మిగతా ప్రపంచ దేశాల నాయకులు మోదీ వెనకే ఉన్నారు. ప్రపంచంలో ప్రముఖ దేశాల ప్రధానులు, అధ్యక్షులు అయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరిక్ అధ్యక్షుడు బో బిడెన్, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కల్, ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మక్రాన్ వంటి వారు మోదీ తర్వాతే ఉండటం గమనార్హం

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news