మోడీజీ… లాక్ డౌన్ ఉంచండి… ప్రజల డిమాండ్…!

-

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించడమే మంచిదా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వాలు దీని గురించి ఎంత తక్కువ చెప్పినా సరే దాని తీవ్రత మాత్రం అంచనా వేయలేని స్థాయిలో ఉంది అనేది వాస్తవం. వాస్తవాలు చెప్తున్న వారిని తప్పుడు ప్రచారం అని కొందరు అంటున్నా… ఇప్పుడు కరోనా మాత్రం మన దేశానికి సునామిలా వచ్చింది.

ఇప్పుడు లాక్ డౌన్ ని ప్రకటించకపోయి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అనేది వాస్తవం. ఇప్పుడు దేశంలో కరోనా ఈ స్థాయిలో ఉందీ అంటే అది లాక్ డౌన్ పుణ్యమే. లేకపోయి ఉంటే ఇటలీ కన్నా దారుణమైన పరిస్థితులు ఉంటాయి అనేది వాస్తవం. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రకటించినా సరే విస్తరిస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా కొన్ని రాష్ట్రాల్లో దారుణంగా ఉంది.

మహారాష్ట్రలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఉద్దావ్ థాకరే సర్కార్ ఎన్ని చర్యలు చేపట్టినా సరే కరోనా మాత్రం ఆగడం లేదు అనేది వాస్తవం. అయితే ఇప్పుడు ప్రజల నుంచి వినపడుతున్న డిమాండ్ ప్రకారం… లాక్ డౌన్ ని కొనసాగించాలని ఏ పబ్లిక్ రవాణా కూడా కొనసాగకుండా చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రైల్వే గాని విమానాలు గాని ఇప్పుడు తిరిగితే ఊహకు అందని విధంగా ఉంటాయి పరిస్థితులు. మన దేశంలో వైద్య పరికరాల కొరత చాలా తీవ్రంగా ఉంది.

ఇప్పుడు లాక్ డౌన్ ని గనుక ఎత్తేస్తే పరిస్థితి మరింత క్షీణించి కేసులు పెరుగుతాయి. అసలు ఏ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ ని ఎత్తివేయడానికి వీలు లేదని పరిస్థితులు చాలా భయంకరంగా మారుతున్నాయని, వైరస్ ని పాలకులు ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దు అని సూచిస్తున్నారు. ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తేయాలా వద్దా అనే అంశంపై ఢిల్లీ కేంద్ర వర్గాలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరోనా లాక్ డౌన్ ఎత్తివేస్తే పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎం చేస్తారు అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news