హైదరాబాద్ వాసి, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గొప్ప ఘనతను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో తొలిసారి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన జాబితాలో సిరాజ్ 729లతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఆస్ట్రేలియా పేసర్ హేజిల్ వుడ్ 727, న్యూజిలాండ్ పైసా ట్రెంట్ బౌల్టు 708 లను వెనక్కి నెట్టి అతడు ఈ ఘనత సాధించాడు. ఏడాదిగా వన్డే క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ సొంత గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్ లతో సిరీస్ లలో అదరగొట్టాడు. మరో బౌలర్ మహమ్మద్ షమీ 11 స్థానాలు మెరుగై 32వ ర్యాంక్ సాధించాడు. వన్డేల్లో వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న గిల్ బ్యాటర్ ర్యాంకింగ్స్ లో పురోగతి సాధించాడు.