ఒకే ఫ్రేమ్‌లో మోహన్ లాల్, కమల్ హాసన్..ఫ్యాన్స్ హ్యాపీ

-

లెజెండరీ యాక్టర్స్ మోహన్ లాల్, కమల్ హాసన్ లను ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..అత్యద్భుతం కదా..ఆ సంఘటన జరిగింది. పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ..హౌజ్ కు గెస్ట్ గా వచ్చారు లోకనాయకుడు కమల్ హాసన్. ఇందుకు సంబంధించిన ఫొటోను నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అవి వైరలవుతున్నాయి.

——–

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విక్రమ్’’ ఫిల్మ్ వచ్చే నెల 3న విడుదల కానుంది. దేశవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కమల్ హాసన్ ఫుల్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మలయాళం బిగ్ బాస్ షోకు వెళ్లి ‘‘విక్రమ్’’ చిత్ర విశేషాలు పంచుకున్నారు. మాలీవుడ్ (మలయాళం) కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్..తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇద్దరు లెజెండ్స్ ను ఒకే ఫ్రేమ్ లో చూసి సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. వీరిరువురి కాంబోలో సినిమా రావాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news