నీటి కోసం వచ్చిన కోతికి ఊరి..!

-

మనుషుల్లో మానవత్వం అనేది తగ్గిపోతుంది.. రాక్షసత్వం పెరిగిపోతుంది. మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ దారుణమైన ఘటనే ఇందుకు నిదర్శనం.. దాహం తీర్చుకునేందుకు వచ్చిన కోతిని పట్టుకుని, దాన్ని కొట్టి.. అనంతరం ఉరివేసి చంపాడు ఒక క్రూరుడు.

ఖమ్మం జిల్లా వేంనూరు మండలంలోని అమ్మపాలెంలో ఈ నెల 26న సాధు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న తొట్టెలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించింది ఓ వానరం. అయితే ఈ క్రమంలో పట్టు తప్పి ఆ తొట్టెలో పడిపోయింది. దీన్ని గమనించిన వెంకటేశ్వరరావు మరో ఇద్దరితో కలిసి దానిని పట్టుకుని మెడకు తాడు కట్టి చెట్టుకు వేలాడదీశారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టి చంపారు. వేలాడుతున్న కోతి కళేబరాన్ని సాయంత్రం వరకు అలాగే ఉంచేశారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు స్పందించారు. గ్రామానికి చేరుకుని వానరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. వానరంపై దాడి చేసిన నిందితులు వెంకటేశ్వరరావు, జోసెఫ్ రాజు, గౌడెల్లి గణపతిలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి రూ. 25 వేల జరిమానా విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news