అగ్రరాజ్యం మంకీపాక్స్‌ బీభత్సం.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

-

కరోనాతో ఓ వైపు ప్రజలు అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యంలో మంకీపాక్స్‌ బీభత్సం సృష్టిస్తోంది. అమెరికాలో మంకీపాక్స్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండటంతో అక్క‌డ ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల పంపిణీ, చికిత్సను వేగ‌వంతం చేయ‌నున్నారు అధికారులు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

With 2 more, India records 8 monkeypox cases | Lifestyle News,The Indian  Express

అమెరికాలో సుమారు 6600 కేసులు న‌మోదు అయ్యాయి. దీంట్లో మూడ‌వ వంతు కేసులు న్యూయార్క్‌లో  బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ రాష్ట్రం స్వంతంగా ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించుకుంది. కాలిఫోర్నియా, ఇలియాస్‌లోనూ అధిక కేసులు న‌మోదు అయ్యాయి. ఈ ఏడాది ప్ర‌పంచ‌వ్యాప్తంగా 26వేల కేసులు న‌మోదు అయిన‌ట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ చెప్పింది. శృంగారం ద్వారా మంకీపాక్స్ సోకుతున్న‌ట్లు తెలుస్తున్నా, దీనిపై క్లారిటీ లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news