సాధారణంగా ఎవరైనా ఆరు, ఏడూ గంటలు నిద్రపోతు ఉంటాం. కానీ ఈమె అరగంట కంటే ఎక్కువ నిద్రపోదట. అయితే దీనికి గల కారణం ఏమిటంటే..? ఈమె పేరు రూబీ చాంబర్‌లైన్. ఇంగ్లాండ్ లోని లీసెస్టర్షైర్ లో ఉంటుంది. ఈమె 21 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఒక్క సారిగా నడవలేక ఇబ్బంది పడింది దీనితో నిద్రను కోల్పోయింది. ఏడాది పాటు మంచంపైన నిద్ర లేకుండా ఉండేది. ఈమెకి వచ్చిన సమస్య గురించి చూస్తే… ఆమె ఎనిమిదేళ్ల వయస్సు నుంచి కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ (CRPS) తో బాధ పడుతోంది.
ఎడమ కాలి నుంచి మొదలైన సీఆర్‌పీఎస్ సమస్య మొత్తం శరీరం లోని కింది భాగానికి పాకింది. ఇలా ఆమె నడవలేక పోయేది. అలానే విపరీతమైన నొప్పి వలన నిద్రకూడా పట్టేది కాదట. వెన్ను పాము ఉద్దీపన శస్త్ర చికిత్స (Spinal cord stimulation surgery) కోసం 35 పౌండ్లు (3.4 లక్షలు) వెచ్చించింది. వైద్యులు పేస్‌మేకర్ తరహా బ్యాటరీ ప్యాక్‌ను వెన్నుకు అమర్చారు. ఆ ప్యాక్‌లోని ఎలక్ట్రోడ్‌లను వెన్ను నుంచి ఆమె మణికట్టుకు అనుసంధించారు.
ఇలా టెక్నాలజీ తో సాధ్యం అయ్యింది. ఆ ప్యాక్‌కు సంబంధించిన రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కగానే.. ఆమె మెదడుకు వెళ్లే నొప్పి సిగ్నల్స్‌ను ఎలక్ట్రికల్ పల్స్ బ్లాక్ చేస్తున్నాయి. దీనితో ఆమెకి నొప్పి రాదు. కానీ ఈమెకి ఎనభై శాతం మాయమైపోయింది. డిగ్రీ కూడా ఈమె ఇప్పుడు పూర్తి చేయబోతోందట. కానీ ఈ వింత రోగం నుండి బయట పడడం నిజంగా గొప్ప విషయమే కదా..!