టాటా నుంచి మరిన్నీ ఈవీలు… త్వరలో మార్కెట్ లోకి 5 ఎలక్ట్రిక్ కార్లు

-

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటర్స్ దూసుకుపోతోంది. టాటా నుంచి వరసగా ఈవీ కార్లు వస్తున్నాయి. ముఖ్యంగా టాటా తీసుకువచ్చిని ‘నెక్సాన్ ఈవీ సూపర్ క్లిక్ అయింది. దీంతో పాటు ‘టిగోర్ ఈవీ’ని కూడా టాటా తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ కార్లలో టాటాకు ఎంజీ పోటీ ఇస్తోంది. ఎంజీ నుంచి ఇప్పటికే ‘జెడ్ఎస్ ఈవీ’ వచ్చింది. టాటా నెక్సాన్ కు పోటీ ఇస్తోంది. దీంతో పాటు హ్యందాయ్ కోనా కూడా ఈవీ కెటగిరీలో ఉన్నప్పటికీ.. టాటాను ఢీకొనేలా సేల్స్ లేవు. అయితే భవిష్యత్తులో టాటా నుంచి మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి.

టాటా ప్రస్తుతం లాంగ్ రేంజ్ ఇచ్చే ఈవీలపై నజర్ పెట్టింది. టాటా నుంచి త్వరలో 5 ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. టాటా కర్వ్ అనే మిడ్ సైజ్ ఎస్ యూవీ ని మార్కెట్ లోకి తీసుకురానున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ల రేంజ్ లను పెంచి కొత్తగా మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీటి రేంజ్ దాదాపుగా 370-400 ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.  టాటా సియెర్రా ఈవీ, అల్ట్రోజ్ ఈవీ కార్లను కూడా మార్కెట్లోకి త్వరలో తీసుకురాన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news