పర్యాటకాన్ని ఇష్టపడే వారు జీవితాన్ని ఎక్కువగా ప్రేమించేవారయి ఉంటారు. ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనే కోరిక ఉండడంతో జీవితాన్ని అమితంగా ప్రేమిస్తారు. ప్రపంచం మొత్తం చుట్టివచ్చినా కూడా భూమి మీద మీరు చూడని ప్రదేశాలు చాలా ఉంటాయి. అలాంటి ప్రదేశాలకు పర్యాటకులు Tourist Places ఎక్కువగా వెళ్ళకపోతుండవచ్చు. కానీ ఆ అద్భుత ప్రాంతాల అందాలని ఖచ్చితంగా చూడాల్సిందే.
అలస్కా
ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడాలి. కానీ చాలా తక్కువ మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. క్రూయిజ్ బుక్ చేసుకుని సముద్రం మీద అలా తిరుగుతుంటే వచ్చే ఆనందాన్ని ఇంకెక్కడా పొందలేరు.
మాల్డోవా
ఉక్రెయిన్, రొమేనియా మధ్యలో ఉన్న చిన్న దేశం ఇది. ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో వైన్ తయారయ్యే ఈ ప్రాంతం పర్యాటకానికి చాలా బాగుంటుంది. చిన్న దేశాన్ని పెద్ద మనసుతో చూడాలనుకుంటే మీ బకెట్ లిస్టులో దీన్ని చేర్చుకోండి.
కిర్గిస్తాన్
సంస్కృతి సాంప్రదాయల ప్రాంతమైన కిర్గిస్తాన్ కి రావడానికి పర్యాటకులు ఉత్సాహం చూపాలంటే చరిత్ర మీద ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాల్లో ఎంతో చరిత్ర దాగి ఉంది.
డామినికా
కరీబియన్ దీవుల్లోని అందమైన రహస్య ప్రాంతం ఇది. పాలపొంగుల జలపాతాలు, ప్రకృతి సోయగాలు చూడడానికి అద్భుతమైన ప్రదేశం.
హైతీ
అందమైన సముద్ర తీరాలలో ఇసుక తిన్నెల మీద హాయిగా ఆడుకుందామని అనుకునే ప్రతీ ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. చుట్టూ పర్వతాలు ఎత్తుగా ఉండి ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తాయి.
మంగోలియా
విదేశీ పర్యాటకులకు బాగా నచ్చే హాలీడే స్పాట్ ఇది. సైబీరియన్ ఎక్స్ ప్రెస్ ద్వారా పూర్తి దేశాన్ని చుట్టే అవకాశం ఉంది.
ఫిలిప్పీన్స్
సుమారు 7వేల దీవులు ఉన్న ఈ దేశం సముద్ర తీరాలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఉన్నంత సేపు ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నట్టుగా అనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.