మోస్ట్ బ్యూటిఫుల్ సౌత్ హీరోయిన్లు ఎవరు.. Chat ​​GPT ఆన్సర్ ఏంటో తెలుసా..?

-

మానవ సృష్టినే ఛాలెంజ్ చేస్తోంది మనిషి సృష్టించిన సాంకేతికత. అందులో ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిందే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ మనం ఏ క్వశ్చన్ వేసినా దానికి తగ్గ సమాధానం ఇస్తుంది. ప్రజెంట్ ట్రెండ్ ఈ చాట్ జీపీటీదే. తన క్రేజీ బట్ పర్ఫెక్ట్ సమాధానాలతో యూజర్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. అందుకే రోజురోజుకు దీనికి డిమాండ్ పెరుగుతోంది.

చాట్ జీపీటీ క్రేజ్ చూసి చాలా టెక్ కంపెనీలు దానికి పోటీగా తమ ప్రాడక్ట్స్ తయారు చేస్తున్నాయి. అంతటి సక్సెస్ సాధించింది ఈ సూపర్ కూల్ చాట్ జీపీటీ. అయితే దీన్ని ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పేస్తుంది. తాజాగా చాట్ జీపీటీని దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లు ఎవరు అని అడిగితే ఓ క్రేజీ లిస్టు ఇచ్చింది. మరి ఈ చాట్ జీపీటీ చెప్పిన ఆ బ్యూటీఫుల్ భామలెవరో తెలుసా..

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మహానటితో జాతీయ అవార్డు దక్కించుకున్న క్యూటీ కీర్తి సురేశ్, వర్సటైల్ హీరోయిన్ అనుష్క, ఎవర్ గ్రీన్ హీరోయిన్ త్రిష, ఛార్మింగ్ హీరోయిన్ శ్రుతి హాసన్, మిల్కీ బ్యూటీ తమన్నా.. వీరే చాట్ జీపీటీ చెప్పిన అందమైన సుందరాంగులు. ఈ లిస్టు చూస్తుంటే అది చెప్పింది నిజమే కదా అనిపిస్తోంది కదూ.

Read more RELATED
Recommended to you

Latest news