రెవెన్యూ పోలీస్ మున్సిపల్ శాఖ అధికారులపై ఎక్కువగా ఏసీబీ కేసులు నమోదు అయినట్లు ఎన్ జీఓ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో బయటపడింది. ఈ సర్వే ప్రకారం.. గత ఏడాది మూడు శాఖల అధికారుల పై 150 కేసులు నమోదు చేసిన ఏసీబీ… అవినీతికి పాల్పడుతున్న అధికారుల్లో మొదటి స్థానంలో రెవెన్యూ శాఖ ఉన్నట్లు తేల్చింది.
ఆర్డిఓ నుండి విఆర్ఓ దాక పైసావసూల్ లకు అధికారులు పాల్పడుతున్నట్లు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పనులు సాఫీగా చేసేందుకు అవినీతి బాట పడుతున్నట్లు వెల్లడించింది. పాస్ బుక్ జారీ, ల్యాండ్ సర్వే, రెవెన్యూ సర్టిఫికెట్ లు ఇచ్చేందుకు భారీగా లంచం అడుగుతున్నారట. రెవెన్యూ తర్వాత పోలీసు శాఖ లో అవినీతి పరులు అని సర్వేలో తేలింది.
పది మంది ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లను ఎసిబి కేసుల కింద సస్పెండ్ అయ్యారట. ఎఫ్ ఐ ఆర్ నమోదు, బెయిల్ పై నిందితులను వదిలేయటం, దర్యాప్తు లో జాప్యం చేసేందుకు లంచం ఖాకీలు డిమాండ్ చేస్తున్నారట. మూడు వేల మందితో చేసిన సర్వే లో తేలింది. రెవెన్యూ, పోలీస్ అధికారులే ఎక్కువ గా 90 శాతం మంది లంచాలు డిమాండ్ చేసినట్టు చెప్పింది సర్వే. 40 శాతం ప్రభుత్వ అధికారులు లంచం తీసుకునే పనులు చేస్తున్నారని సర్వేలో ఎన్ జి ఓ పేర్కొంది.