హీటర్ షార్ట్​సర్కూట్.. తల్లితో సహా ఇద్దరు పిల్లలు సజీవదహనం

-

హీటర్​ షార్ట్సర్య్కూట్​ కావడం వల్ల తల్లి సహా ఇద్దరు చిన్నారులు సజీవదహనమైన సంఘటన హిమాచల్ ప్రదేశ్​లోని హమీపూర్ జిల్లాలోని జల్లా అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు పాల్, అతడి భార్య అనిత (28) కురారా పోలీస్​​స్టేషన్​ పరిధిలోని జల్లా అనే గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మోహిని(6), రోహిని(3) ఉన్నారు. వీరంతా నిద్రిస్తున్న సమయంలో రూమ్​ హీటర్​ షార్ట్​​ సర్క్యూట్​ అయింది. దీంతో మంటలు వ్యాపించి అనితతో పాటు ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిందని సమాచారం. సమచారం అందుకున్న వెంటనే ఫైర్​ ఇంజిన్​ ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news