కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.. కేసీఆర్ ఆ ప‌ని చేయ‌క‌పోతే సూసైడ్ చేసుకుంటారంట‌..

-

ఏదేమైనా కూడా ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా కావాల్సింది ప‌ద‌వేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అది కావాలంటే ఇప్ప‌డు ఎంత పొగిడితే అంత లాభం అన్న‌ట్టు త‌యారవుతున్నారు నేత‌లు. ఇక పోతే ఇప్పుడు కూడా ఓ రాజ‌కీయ నేత పార్టీలో చేర‌క‌ముందే గులాబీ బాస్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఇప్పుడు తాము అనుక‌న్న స్థాయికి ఎద‌గాలంటే ఆ ప‌ని త‌ప్పని స‌రి మ‌రి. కాగా ఇప్పుడు కేసీఆర్ తీసుకు వ‌చ్చిన దళిత బంధు పథకాన్ని మొద‌టి నుంచి ఆకాశంలో మెరుపు లాంటిద‌ని పొగిడేస్తున్నారు మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.

Motkupalli Narasimhulu
Motkupalli Narasimhulu

కాగా ఇప్పుడు ఆయ‌న ఏవో కార‌ణా వ‌ల్ల బీజేపీకి గుడ్ బై చెప్ప‌డంతో ఆయ‌న అస‌లు ఏ పార్టీలో చేర‌తార‌ని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే పార్టీని వీడి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఆయ‌న మాత్రం ఏ పార్టీలో చేర‌ట్లేదు. కానీ మొద‌టి నుంచి టీఆర్ఎస్‌ పార్టీని అలాగే కేసీఆర్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రోసారి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసారు.

కేసీఆర్ ఇప్పుడు తీసుక‌చ్చిన దళితబంధు నూటిక నూరు శాతం అమలు చేస్తార‌ని, ఆయ‌న మాటిస్తే అస్స‌లు త‌ప్ప‌ర‌ని చెబుతున్నారు. అయితే ఇక్క‌డ ఆయ‌న మ‌రోఅడుగు ముంకేసి ఎవ‌రూ ఊహించ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేంటంటే కేసీఆర్ గ‌న‌క ఒక‌వేళ ద‌ళిత‌బంధు ప‌త‌కాన్ని అమలు చేయ‌న‌ట్ల‌యితే తాను యాదాద్రి న‌ర్సింహ‌స్వామి సాక్షిగా ఆ కొండ మీదే పెట్రోల్ పోసుకుని ఆత్మ హ‌త్య చేసుకుంటానంటూ సంచ‌ల‌నం రేపారు. అంటే మొత్తానికి ఆయ‌న ఎస్సీ నేత కావ‌డంతో ఎస్సీల్లో కేసీఆర్‌కు గుర్తింపు తీసుకొచ్చే ప‌నిలో ప‌డ్డార‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news