ఏపీ ఫార్ములా తెలంగాణలో..అందుకే మల్లన్న అరెస్ట్?

-

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వరుసపెట్టి టీడీపీ నేతలు జైలుకెళ్లిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది టి‌డి‌పి నాయకులపై కేసులు పెట్టారు. అయితే ఇక్కడ టి‌డి‌పి నాయకులు తప్పు చేశారా? లేదా అనే అంశాలపై మాత్రం పెద్దగా క్లారిటీ లేదు. కానీ వరుసపెట్టి టి‌డి‌పి నాయకులు మాత్రం జైలు పాలయ్యారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా తమ నాయకులని జైల్లో పెట్టేస్తుందని టీడీపీ వాదిస్తూనే ఉంది. కాదు టి‌డి‌పి నాయకులు తప్పు చేశారో కాబట్టే జైలుకు వెళుతున్నారని, చట్టం ముందు అందరూ సమానమే అని వైసీపీ చెబుతోంది.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న
Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

కానీ ఏది ఎలా జరిగినా ఊహించని రీతిలో టి‌డి‌పి నాయకులు జైలుకెళ్లారు. ఇక ఇలా టి‌డి‌పి నేతలు జైలుకెళ్లడంపై ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో అధికారంలో ఉన్న టి‌డి‌పి, వైసీపీ నాయకులని ఇబ్బంది పెట్టిందని, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, టి‌డి‌పి నాయకులని ఇబ్బంది పెడుతుందని, ఇది కక్ష సాధింపే అని ఎక్కువమంది ప్రజలు చర్చించుకుంటున్నారు.

అయితే ఏపీ తరహాలో తెలంగాణలో ప్రతిపక్ష నాయకులపై కే‌సి‌ఆర్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం పెద్దగా జరగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే మొన్నటివరకు తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్దగా ఉనికి లేకపోవడమే అని,   కానీ ఇప్పుడుప్పుడే ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయని, దీంతో  ప్రతిపక్ష నాయకులపై పోలీసుల ఆంక్షలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

ఇదే క్రమంలో ప్రతిరోజూ కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడే తీన్మార్ మల్లన్న అరెస్ట్ జరిగిందని పలువురు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మల్లన్నపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే తన వద్ద నుంచి మల్లన్న రూ.30 లక్షలు డిమాండ్‌ చేస్తున్నాడని ఏప్రిల్‌ 22న లక్ష్మీకాంత్ శర్మ.. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో తాజాగా మల్లనని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని, అరెస్టు చేశారని, దీనిపై న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని మల్లన్న మాట్లాడుతున్నారు. ఇక ఏప్రిల్‌లో కేసు నమోదైతే ఇన్ని నెలల తర్వాత మల్లన్న అరెస్ట్ జరగడం అనేది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరిగి ఉంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి మల్లన్న కేసులో చివరికి ఏం తేలుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news