సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

-

మాజీ మంత్రి, సీనియర్ మోస్ట్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి మోత్కుపల్లి నర్సింహులును ఆహ్వానించారు.

మోత్కుపల్లి నర్సింహులు తో పాటు… కొంతమంది దళిత నాయకులు కూడా టిఆర్ఎస్ పార్టీలో.. సీఎం కేసీఆర్ సమక్షంలో చేరారు. ఇక అంతకు ముందు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు మోత్కుపల్లి. ఆ తర్వాత బషీర్బాగ్ చౌరస్తాలోని మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాని కి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిం చిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నారు మోత్కుపల్లి. కాసేపటి క్రితమే సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో అధికారికంగా చేరారు మోత్కుపల్లి నర్సింహులు.

 

Read more RELATED
Recommended to you

Latest news