భార‌త్‌లో విడుదలైన మోటోరోలా మ‌డ‌త‌బెట్టే ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా రేజ‌ర్‌ను భార‌త్‌లో సోమ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో 6.2 ఇంచుల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీన్ని స‌గం వ‌ర‌కు మ‌డ‌త‌బెట్ట‌వ‌చ్చు. దీంతో వెనుక వైపు ఉన్న మ‌రో ఎక్స్‌ట‌ర్న‌ల్ డిస్‌ప్లేపై నోటిఫికేషన్లు చూసుకోవ‌చ్చు. అలాగే సెల్ఫీలు తీసుకోవ‌చ్చు, మ్యూజిక్ ప్లే చేయ‌వ‌చ్చు. గూగుల్ అసిస్టెంట్‌ను కూడా వాడుకోవ‌చ్చు.

moto razr 2019 smart phone launched in india know how much price it is

ఈ ఫోన్‌లో 16 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి లేజ‌ర్ ఆటో ఫోకస్‌, నైట్ విజ‌న్ మోడ్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీంతోపాటు బిల్టిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని కూడా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల ఈ కెమెరాతో అద్భుత‌మైన ఫొటోలు తీసుకోవ‌చ్చు. ఇక సెల్ఫీలు తీసుకునేందుకు 5 మెగాపిక్స‌ల్ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌కు తోడు 6జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, యూఎస్‌బీ టైప్ సి, 2510 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 15 వాట్ల ట‌ర్బో ప‌వ‌ర్ చార్జింగ్‌.. త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఈఫోన్‌లో అందిస్తున్నారు.

మోటోరోలా రేజ‌ర్ స్పెసిఫికేష‌న్లు…

* 6.2 ఇంచుల ఫోల్డ‌బుల్‌ పీఓలెడ్ డిస్‌ప్లే, 2142 x 876 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 2.7 ఇంచుల ఎక్స్‌ట‌ర్న‌ల్ డిస్‌ప్లే, 600 x 800 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్
* 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై
* 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెంట్ నానో కోటింగ్
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ
* యూఎస్‌బీ టైప్ సి, 2510 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ఇక ఈ ఫోన్‌ను రూ.1,24,999 ధ‌ర‌కు ఏప్రిల్ 2వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఇందుకు గాను సోమ‌వారం నుంచే ఈ ఫోన్‌కు ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించారు. కాగా ఫోన్ లాంచింగ్ సంద‌ర్భంగా ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. సిటీ బ్యాంక్ క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.10వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్ ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకునే వారికే వ‌ర్తిస్తుంది. అలాగే ఈ ఫోన్‌పై సిటీ బ్యాంక్ కార్డుల‌తో 24 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం పొంద‌వ‌చ్చు. అదే ఇత‌ర కార్డుల‌తో అయితే 12 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ల‌భిస్తుంది. జియో వినియోగ‌దారులు ఈ ఫోన్ కొనుగోలుపై ఏకంగా 1.4 టీబీ ఉచిత డేటా పొంద‌వ‌చ్చు. అలాగే ఈ ఫోన్ కొనుగోలుపై రూ.7,999 విలువ గ‌ల 1 ఇయ‌ర్ వాలిడిటీ ఉన్న వ‌న్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫ‌ర్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news