ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయంలో ఇప్పుడు కొన్ని కీలక చర్చలు జరుగుతున్నాయి. ముందు అన్ని పార్టీలు కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసింది అని ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అధికార పార్టీ స్వరం మార్చింది. ఒక్కసారిగా విమర్శలకు దిగడంతో అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నేతలు అరగంటలో రెండు మాటలు మాట్లాడారు.
ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా రెండు మాటలు మాట్లాడారు. ముందు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. దానిలో తప్పేమీ ఉందని ఆమె ప్రశ్నించారు. కరోనా వైరస్ కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం నిర్ణయం వాయిదా వేసింది అని ప్రకటించారు. వైసీపీ అధికారిక పత్రిక సహా పలు పత్రికల్లో దీనికి సంబంధించిన మీడియా సమావేశం వైరల్ అయింది.
ఆ మాటలు మరువక ముందే, కేవల౦ అరగంట వ్యవధిలో ఆమె రెండు మాటలు మాట్లాడారు. కేవలం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఎవరిని అడగకుండా ఏ పార్టీకి చెప్పకుండా తీసుకున్న నిర్ణయం ఇదీ అంటూ ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు చేసారు. ఈ రెండు వీడియో లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. రోజాపై వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.