చక్కర పరిశ్రమలను కొనడానికి తాను సిద్దంగా ఉన్నానని ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలోని ముత్యంపేట, భోధన్ లలో చక్కర పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఈ పరిశ్రమలను తాను కొనడానికి సిద్ధంగా ఉన్నానని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా భోధన్ చక్కర పరిశ్రమలను తాను రూ.200 నుండి రూ.300 కోట్లు పెట్టి కొనడానాకి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.
ప్రభుత్వం తనకు చక్కర పరిశ్రమలను అప్పగిస్తే చక్కర తో పాటూ ఇథనాల్ మరియు లిక్కర్ లాంటివి తయారు చేస్తానని చెప్పారు. చక్కర పరిశ్రమలను కొనుగోలు చేసి నిజామాబాద్ రైతుల కండ్లలో ఆనందాన్ని నింపుతానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీలు కాకపోతే మంత్రి కేటీఆర్ తో చర్చలు జరుపుతానని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.