శ్రీకాకుళం జిల్లాలో సర్పంచ్ పై కాల్పులు….!

-

శ్రీకాకులం జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకుంది. స‌ర్పంచ్ పై ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న జిల్లాలోని రామ‌చంద్రాపురం లో చోటు చేసుకుంది. రామ‌చంద్రాపురం స‌ర్పంచ్ వెంక‌టర‌మ‌ణ వ‌ద్ద‌కు మంగ‌ళ‌వారం రాత్రి ఓ మ‌హిళ వ‌చ్చింది. మ‌ధురాన‌గ‌ర్ లోని స‌ర్పంచ్ కార్యాల‌యం వ‌ద్ద వెంట‌క‌ర‌మ‌ణ ఉండ‌గా ఆయ‌న వ‌ద్దకే వెళ్లింది. ఆమెతో పాటు మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా స‌ర్పంచ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు.

కాగా మ‌హిళ స‌ర్పంచ్ తో మాట్లాడుతున్న క్ర‌మంలో అదును చూసుకుని ఆమె వెంట వ‌చ్చిన ఇద్ద‌రూ కాల్ప‌ల‌కు తెగ‌బ‌డ్డారు. దాంతో స‌ర్పంచ్ కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. కాల్పులు జ‌రిపిన వెంట‌నే దుండ‌గులు అక్కడ నుండి పారిపోయారు. స్థానికులు స‌ర్పంచ్ ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. అక్క‌డ రెండు బుల్లెట్ల‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసుపై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news