తనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. తనపై జరుగుతున్న దాడుల వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఇప్పటికే వై కేటగిరి అధికారులు తమ ఇంటికి వచ్చారని, ప్రాణహాని ఉందని చెప్పిన విషయాలను వారు నోట్ చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీపై తనకు నమ్మకం లేదన్నారు. తనకు కేంద్ర ప్రభుత్వమే భదత్రా ఏర్పాటు చేసిందని చెప్పారు.
గతంలో తనపై జరిగిన దాడులను విశ్లేషించి అధికారులే ఇంటికి వచ్చారన్నారు. గతంలో జరిగిన దాడులు, పరిణామాలను అధికారులకు వివరించినట్లు ఆయన తెలిపారు. అనంతరం అధికారులు చాయ్ తాగి వెళ్లి పోయారన్నారు. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై ప్లస్కేటగిరీ భద్రత కేంద్రం కల్పించిన విషయం తెలిసిందే.