ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు షిఫ్ట్ అవుతారు అంటూ ప్రచారం సాగుతూండగానే వైసీపీ ప్రభుత్వం పాలన నాలుగేళ్ళ ముచ్చట అలా ముగిసిపోయింది. ఇక చేతిలో మిగిలింది కొద్ది నెలలు మాత్రమే. అది కూడా ఈ ఏడాది మిగిలిన నెలలలో వెళ్లకపోతే ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది. దాంతో అది కుదిరే వ్యవహారం కాదు.
అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు ప్రకటించారు. అనంతరం విశాఖ నుంచి పరిపాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అక్కడ ఇల్లు నిర్మిస్తున్నారు. అయితే ఈ దసరా కన్నా ముందే విశాఖకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. రుషికొండ సమీపంలో వేగంగా ఇల్లు నిర్మాణం జరుగుతోంది. సీఎంవోతో పాటు ఇల్లు కూడా పక్క పక్కనే ఉండేలా ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 26 తర్వాత జగన్ అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో సీఎం జగన్ ఉండే ఇల్లును సిద్ధం చేస్తున్నారు.