50 వేల మెజారిటీతో ఓడిస్తా… టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎంపీ అరవింద్ సవాల్

టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత దర్శపురి అరవింద్ పై నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. దీంతో ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగింది. కర్రలు, బండలతో దాడులకు దిగారు. ఈ దాడితో ఎంపీ అరవింద్ కారు పూర్తిగా ధ్వంసం అయింది. నిన్న ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

ఈ దాడిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను ఎదురుకోలేకనే టీఆర్ఎస్ పార్టీ దాడులకు తెగబడుతోందని ఆరోపించాయి. ఈనేపథ్యంలో ఎంపీ అరవింద్, టీఆర్ఎస్ పార్టీ నేత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను 50 వేల మెజారిటీతో ఓడిస్తానని సవాల్ చేశారు. నువ్వు కేసీఆర్ నుంచి ముందు టికెట్ తెచ్చుకో.. అని అన్నారు. ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి, పోలీసులు దగ్గరుండి బీజేపీ కార్యకర్తలు, నాపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ దాడిని జాతీయ నాయకత్వం ద్రిష్టికి తీసుకెళ్తామన్నారు.