అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాతో పాటు ఆమె భర్త రవి రాణాలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్రం సీఎం ఉద్ధవ్ థాక్రే హనుమాన్ చాలీసాను పఠనం చేయాలని లేకపోతే.. మేమే సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠనం చేస్తామని నవనీత్ కౌర్, ఆమె రవి రాణాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారి వ్యాఖ్యలపై అగ్రహం వ్యక్తం చేసిన శివసేన నేతలు నవనీత్ కౌర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.
తాజాగా నవనీత్‌కౌర్ దంపతులను ముంబై పోలీసుల అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం ఇంటిముందు హనుమాన్ చాలీసా మాత్రమే పఠిస్తామన్నామని, మేము టెర్రరిస్టులం కాదంటూ.. నవనీత్ కౌర్ దంపతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు విచారిస్తున్నారు. సీఎం నివాసం ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు అనుమతి లేదని పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు.