సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తొలుత నవనీత్ మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. నవనీత్‌కు, ఆమె భర్తకు కరోనా టెస్టులు నిర్వహించారు. దాదాపు 60 మంది సభ్యులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేశారు. దీంతో నవనీత్, ఆమె భర్త సహా ఆమె నివాసంలోని 11 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు.
అయితే హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమెను వెంటనే నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చేసిన నవనీత్.. ఆ తర్వాత మహారాష్ట్ర వెళ్లి అక్కడే పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ అయిపోయింది. కాగా ప్రస్తుతం ఈమె అమరావతి ఎంపి. ఆమె భర్త రవి రానా బద్నేరా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.