పోరాటం వద్దు.. విమర్శలే ముద్దు: “కృషి” చేశామంటున్న బాబు!

-

గడిచిన ఐదేళ్లలో ఏపీకి ఏమి చేశారయ్యా అంటే… “కృషి” చేశామని చెబుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు! ప్రస్తుతం అమరావతి విషయంలో తననుంచి పోరాటాలు, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే రాజినామాలు వంటివి ఆశించొద్దని.. తనను నమ్మి భూములిచ్చిన రాజధాని ప్రాంత రైతులకు పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు… కేవలం ఆన్ లైన్ లో ఆవేశం పడటానికే పరిమితమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రోజు విడిచి రోజు ఆన్ లైన్ లో దర్శనం ఇస్తోన్న బాబు… తాజాగా ఇంతకాలం తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మొదలుపెట్టారు! ప్రస్తుతం టాపిక్ అమారవతి రైతుల గురించి ఆలోచించాలని వారంతా కోరుకుంటుంటే… తన గత ప్రతిభ గురించి బాబు ఊకదంపుడు ఉపన్యాశాలు విత్ వీడియో ఇస్తున్నారు! చిత్రం ఏమిటంటే… బాబు గతంలో చేసినవాటిలో మెజారిటీ అంశాలు “శంకుస్థాపనలు”, “కృషి” చేయడాలు, “తపించడలు” కనిపించడం కొసమెరుపు!

వివరాల్లోకి వెళ్తే… “మా ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చూపించాలని తపించాం. దాని కోసం రాత్రింబవళ్లూ పరుగులు తీశాం” అని అంటున్నారు చంద్రబాబు. తాజాగా వీడియో కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు… రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా.. ఏ గ్రామంలోనైనా అభివృద్ధికి సంబంధించి టీడీపీ ముద్రే కనిపిస్తుందని.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా 13 జిల్లాల్లో అభివృద్ధి పనులు చేశామని చెప్పుకొచ్చారు.

రాయలసీమకు సంబందించి బాబు ఏమేమి చేశారో తొలుత చెప్పుకొచ్చారు. “ముచ్చుమర్రి ప్రారంభించాం.. బానకచర్ల ద్వారా గోదావరి నీటిని సీమకు తరలించేలా డిజైన్‌ చేశాం.. ఎడారిలాగా ఉండే చిత్తూరు పశ్చిమ ప్రాంతంలో కుప్పం వరకూ కృష్ణా జలాలు వెళ్లేలా కాల్వల పనులు వేగవంతం చేశాం.. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేశాం” అని చెప్పుకొచ్చారు చంద్రబాబు!

ఇక ఉత్తరాంధ్ర విషయానికొచ్చిన బాబు… విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం, మెడికల్‌ కళాశాల, ఉద్యానవన కళాశాల వంటివి తెచ్చాం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్ధలాన్ని ఈ జిల్లా పరిధిలో ఎంపిక చేయడం ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి బాటలుపరిచాం.. పైడి భీమవరం కేంద్రంగా ఫార్మా పరిశ్రమలు రావడానికి కృషి చేశాం.. బిల్‌గేట్స్‌ను కూడా విశాఖకు తీసుకొచ్చాం..” అని తెలిపారు!

ఫైనల్ గా… “రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్ధానంలో నిలపాలని మేం తపించాం” అని చెప్పుకొచ్చారు బాబు. నిజంగా అన్ని చేస్తే… 2019 లో అలా ఎందుకు జరిగిందబ్బా… నో కామెంట్ ప్లీజ్!!

Read more RELATED
Recommended to you

Latest news