కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన ఆ పార్టీ అసంతృప్త ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు కొద్ది రోజులుగా ఢిల్లీ నుంచే రాష్ట్ర ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. రఘురామ వరుస పంచ్‌లతో వైసీపీ నేతలు సైతం కక్కలేక మింగలేక అన్న చందంగా ఉంటున్నారు. రఘురామ వేసే సెటైర్లు, పంచ్‌లు టీడీపీ వాళ్లు జనాల్లోకి బాగా తీసుకు వెళుతున్నారు. ఇటు రఘురామకు కౌంటర్‌గా వైసీపీ నేతలు వేసే రీ కౌంటర్లు మాత్రం జనాలకు రీచ్ కావడం లేదు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దేవస్థానం రథం కాలిపోయింది. 60 ఏళ్ల పాటు స్వామి వారి ఆలయంలో ఉంటోన్న ఆ రథం కాలిపోవడంతో హిందూ సంస్థలు, స్వాములు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని హిందూ సంస్థలు కూడా దీని వెనక ఎవరు ? ఉన్నారో చర్యలు తీసుకోవాలని కోరడంతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ కూడా వేసింది. దీనిపై రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ నుంచి మీడియాతో సెటైర్లు వేశారు. ఏపీ మంత్రులు అంతర్వేదిలో రథం దగ్థంపై విచారణ చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై రఘు స్పందిస్తూ ఈ అంశంపై వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారని… మంత్రులను విచారణకు పంపిస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీ మంత్రులు పైకి చూసి తేనెటీగలు ఉన్నాయని పొగ పెట్టారని చెపుతున్నారని.. అర్ధరాత్రి ఎవరైనా తేనెటీగలకు పొగపెడతారా ? అని ఆయన సెటైర్ వేశారు. ఇలాంటి వార్తలు సాక్షిలో రావడంతో వాటిని చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు. మంత్రులతో విచారణ కమిటీ వేసి చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని.. మంచి పోలీస్ అధికారిని నియమించి ఈ సంఘటనపై విచారణ జరిపించాలని ఆయన సూచించారు.
అలా కాకుండా మంత్రులు వెల్లంపల్లి, విశ్వరూప్ వెళ్లి అక్కడ ఏం చేస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ అన్ని మతాలకు చెందిన వ్యక్తి అని..ఇలాంటి విషయాల్లో మంచి సిట్ ఏర్పాటు చేస్తే సులువుగానే 24 గంటల్లో నిందితులను పట్టుకోవచ్చని.. ఇదేం పెద్ద విషయం కాదని రఘురామ తెలిపారు.
-vuyyuru subhash