ఆ ప్రశ్నకు మోదీ సమాధానం ఇవ్వాల్సిందే : ఎంపీ ఉత్తమ్

-

ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకు పడ్డారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎనిమిదేళ్లుగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని అబద్ధపు వాగ్దానాలు చేశారని ఉత్తమ్‌ మండిపడ్డారు.

మోదీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల వివరాలను దాచిపెట్టేందుకు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నుంచి డేటాను విడుదల చేయడం మానేసిందని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను సహజ, ప్రమాద మరణాలుగా నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించడం ద్వారా తెరాస ప్రభుత్వం కూడా రైతుల ఆత్మహత్యల లెక్కలను చూపడంలేదని మండిపడ్డారు. ఈ మేరకు ఉత్తమ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘దేశ వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎప్పుడు ఇల్లు లభిస్తుందో ప్రధాని చెప్పాలి. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అందించిన డేటా ఆధారంగా.. దేశంలోని 52శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. దాదాపు 80శాతం భారతీయులు విషపూరిత నీటిని తాగాల్సి వస్తోంది. మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్‌ వంటి నినాదాలతో ప్రజలను మోసం చేసిన మోదీ.. ఇప్పుడు ‘అమృత్‌ కల్‌’ గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి అన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ఉపయోగించుకుంటున్నారు’’ అని ఉత్తమ్‌ మండిపడ్డారు.Utta

Read more RELATED
Recommended to you

Latest news