రాజ్‌గోపాల్‌ రెడ్డిని గెలిపించాలని వెంకట్‌రెడ్డి ఫోన్.. ఊకొండి ఎంపీటీసీ భర్త ఆరోపణలు

-

మునుగోడు ఉపఎన్నికలో రోజుకో రాజకీయ కోణం బయటకు వస్తోంది. ఈ సీటును దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. సిట్టింగ్ సీటు ఎలాగైనా మళ్లీ తమకే రావాలని కాంగ్రెస్ పాట్లు పడుతోంది. మునుగోడులో ఈసారి పాగా వేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే గెలుపవుతుందని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వాలు, విమర్శలు ప్రతివిమర్శలతో మునుగోడు రాజకీయం హీటెక్కింది.


కానీ తాజాగా ఓ ఎంపీటీసీ చేసిన వ్యాఖ్యలతో మునుగోడు రాజకీయంలో దుమారం రేగింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనకు ఫోన్ చేశారని, పదేపదే వాట్సాప్ కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారని నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి ఎంపీటీసీ సభ్యురాలు పోలగోని విజయలక్ష్మి భర్త సైదులు ఆరోపించారు.

ఊకొండిలో మండల ఇన్‌ఛార్జి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు బుధవారం ఏర్పాటు చేసిన గ్రామస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మండలంలో చాలా మంది కాంగ్రెస్‌ నేతలకు వెంకట్‌రెడ్డి ఇలా ఫోన్‌ చేస్తున్నారని, కానీ బయటికి చెప్పేందుకు వారు ధైర్యం చేయడం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news