ధోనీ పై ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు..ప్రధానంగా యువ క్రికెటర్ల దగ్గర స్పార్క్ లేదని ధోని చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయ్. ఈ సీజన్‌లో మీ ఆటలో మెరుపు ఉందా.. కేదార్ జాదవ్ ఆటలో మెరుపు ఉందా.. ఎక్కడ ఉంది చెన్నైలో మెరుపంటూ ధోనీపై ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.
యంగ్ క్రికెటర్లకు ఛాన్స్ ఇవ్వకుండా ధోనీ అడ్డుకుంటున్నాడని విమర్శలు వస్తున్నాయ్. కేదార్ జాదవ్ లాంటి సీనియర్ సిటిజన్‌తో గేమ్ ఆడించే బదులు బెంచ్ మీద కూర్చున్న కుర్రాళ్లుకి ఛాన్స్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు ధోనీకి సలహాలిస్తున్నారు. ముందు మీరు అవకాశాలు ఇస్తే కదా వారి సత్తా తెలిసేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏ కెప్టెన్ కూడా ఇటువంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడని ధోనీపై ఫైర్ అవుతున్నారు.
ధోనీపై ఫ్యాన్స్ మండిపడటానికి కూడా సరియైన కారణం ఉంది. ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు …ఈసారి ఐపీఎల్‌లో కేదార్ జాదవ్ ప్రదర్శన ఇది. చెన్నై 10 మ్యాచ్‌లు ఆడగా, 8 మ్యాచ్‌లలో అతనికి అవకాశం లభించింది. కానీ ఒక రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా అతడి నుంచి కనీస ప్రదర్శన కూడా రాలేదు. జాదవ్ బ్యాటింగ్ టెస్ట్ ఇన్నింగ్స్‌ని తలపిస్తోంది. ధోనీ కూడా ఈ ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అలాంటి ధోనీ కుర్రాళ్లపై కామెంట్లు చేసే సరికి ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.