హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, నాణ్యమైన ఆటగాళ్లు, ఎంతో బ్రాండ్ విలువ కలిగిన జట్టు ముంబై ఇండియన్స్… గతంలో పలుమార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టుగా పేరు అయినా కూడా ఈ ఐపీఎల్ లో అత్యంత దారుణంగా విఫలం అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ ఇలా స్టార్ ప్లేయర్లంతా విఫలం అవుతున్నారు. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ లో ఓటముల పరంపర కొనసాగుతోంది. వరసగా 7 మ్యాచుల్లో దారుణంగా ఓడిపోయింది. ఇక సెమిస్ ఆశలు గల్లంతయ్యాయి.
ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ జట్లు ఆటతీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు స్టార్ క్రికెటర్ క్రిస్ లిన్. ముంబై ఇండియన్స్ జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నట్లు కనిపిస్తోందని క్రిస్ లిన్ సంచలన వ్యాక్యలు చేశాడు. గతంలో క్రిస్ లిన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడాడు. గెలుపు అలవాటుగా మారినట్లే… ఒక్కోసారి ఓటములు కూడా మారుతాయని క్రిస్ లిన్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫిల్డింగ్ లలో సమస్యలు ఉన్నాయని… కెప్టెన్ సమస్యల్లో ఉన్నప్పుడు పోలార్డ్ వంటి సీనియర్ల సహాయం చేయాలి. కానీ అలాంటిది కనిపించడం లేదని ఆయన అన్నారు. ఎవరికి వారే ఉంటున్నారని అని అన్నాడు.