మునిసిపల్ శాఖ అంటే గ్లామర్ డిపార్ట్మెంట్ కాదు – మంత్రి కేటీఆర్

-

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు – 2022 సాధించిన మునిసిపాలిటీల ప్రజా ప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్జీటీ జరిమానా విధించడంపై స్పందించారు. ఎన్జీటీకి సరైన వివరాలు పంపుదామని తెలిపారు. మునిసిపల్ శాఖ అంటే గ్లామర్ డిపార్ట్మెంట్ కాదని అన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో చెత్త సేకరణ ద్వారా డబ్బులు కూడా వస్తున్నాయని.. ఇలా సిరిసిల్లలో రూ. 8 లక్షలు వ్యర్ధాలు స్వీకరించడం ద్వారా వచ్చాయని తెలిపారు.

స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డులు గెలిచిన 19 పట్టణాలకు 2 కోట్ల చొప్పున నిధులిస్తామని ఆయన తెలిపారు. స్వచ్ఛ కార్యక్రమాలపై అధ్యయనం కోసం… 10 మంది బృందాన్ని జపాన్‌, సింగపూర్‌కు పంపుతామని వెల్లడించారు. స్వచ్ఛతపై బాగా పనిచేస్తున్నవారిని ప్రోత్సహించేందుకు అదనపు నిధులిస్తామన్న కేటీఆర్… పరిశుభ్రతపై ప్రజల్లోనూ స్వతహాగా చైతన్యం రావాలన్నారు. స్వచ్ఛత విభాగంలో ఇండోర్‌కు వరసగా ఆరోసారి అవార్డు వచ్చిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రజలు కూడా కృషి చేయాలని పేర్కొన్నారు. భవిష్యత్‌లో 51 శాతం ప్రజలు పట్టణాల్లో నివసించనున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news