మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉపఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా మునుగోడులో గెలవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికపై కీలక ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 3న మునుగోడుకు తన తో పాటు భట్టి, ఉత్తమ్, జానారెడ్డి వెళుతున్నామన్నారు. ఈ సందర్భంగా మండల ఇంఛార్జిల ఇంటింటి ప్రచారం ఉంటుందని పేర్కొన్నారు. ఇబ్రహింపట్నంలో కుని అపరేషన్ లో మహిళల మరణాలు ప్రభుత్వ హత్యలేనని.. హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇప్పటి వరకు స్పందించలేదు.. మామ..అల్లుళ్ళు మహిళా హంతకులు అని ఆగ్రహించారు.అక్కరకు రాని విషయాలు మాట్లాడే హరీష్.. ఎందుకు ఇబ్రహీం పట్నం ఘటన పై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.